ఆదోని, 12 September
ఆదోనిలోని భాష్యం-2 పాఠశాలలో భాష్యం చైర్మన్ రామకృష్ణ గారి మార్గదర్శకత్వంలో, మాచని కవిత ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు.
ఆదోని భాష్యం-2 పాఠశాలలో ఘనంగా 'హిందీ దివస్' వేడుకలు ఆదోని: స్థానిక భాష్యం-2 పాఠశాలలో భాష్యం చైర్మన్ రామకృష్ణ గారి మార్గదర్శకంలో, మాచని కవిత (JDO) ఆధ్వర్యంలో 'హిందీ దివస్' వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రవిప్రకాష్ గారు మాట్లాడుతూ... విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హిందీ దివస్ పురస్కరించుకుని ప్రత్యేక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు 'వన్ మినిట్ గేమ్', కవితల రచన మరియు కవిత పఠనం పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వికాసంలో భాగస్వాములవుతున్న హిందీ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ అంజి, హేచ్ఎం రేవతి గారితో పాటు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.










