ఆదోని, 11 September
ప్రజారోగ్యం, వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్ఓ) ప్రచురించిన విద్యార్థి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఆదోనిలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై పీడీఎస్ఓ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
*ఆదోనిలో స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ* ---------------------------------- ప్రజారోగ్యం, వైద్య విద్యపై పిడిఎస్ఓ ప్రచురించిన *స్టూడెంట్ ప్రత్యేక సంచిక* ఆవిష్కరణ సభ ఆదోనిలో మహల్తి ఫంక్షన్ హాల్లో,నిర్వహించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్ఓ ఆదోని డివిజన్ సెక్రెటరీ శివ అధ్యక్షత వహించగా..... APTF, రఘురామయ్య, పత్రిక విలేఖరి దశరథి రాముడు ,మాజీ విద్యార్థి ఉద్యమ నాయకుడు కురునేలు, తెలుగు టీచర్ నాల్లారెడ్డి, పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ ఎన్ వై ఎస్ రంగస్వామి, విరేష్ సంచికను ఆవిష్కరించి వారు మాట్లాడుతూ... వైద్యం, వైద్య విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాల్సిన అవసరాన్ని ఈ సంచిక స్పష్టంగా వివరించిందని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూనే 107, 108 జీవోల ద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యం ఖరీదైన సరుకుగా మారి పేదలపై తీవ్ర భారం మోపుతోందని అన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులే ప్రజలకు అండగా నిలిచాయని, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలపై భారీ దోపిడీకి పాల్పడ్డాయని విమర్శించారు. ఆసుపత్రులు అనవసర టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పిపిపి పద్ధతిలో వైద్య విద్య ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, దస్తగిరి ముని ,కాశి, మళ్లీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


