ఆదోని భాష్యం చైర్మన్ రామకృష్ణ, జెడిఓ మాచని కవితల ఆధ్వర్యంలో భాష్యం-2 పాఠశాలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తేజస్విని మాట్లాడుతూ, ఆదోని రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుతపులులు, కృష్ణ జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు, పక్షులు అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయని, మానవ జీవితంపై వాటి ప్రభావం గురించి వివరించారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ (FSO), షమీముల్లా (FBO) పాల్గొన్నారు.
భాష్యం ప్రిన్సిపాల్ జాఫర్ మాట్లాడుతూ, చిరుతపులులు సంచరించే ప్రాంతాల్లో ఒంటరిగా తిరగరాదని సూచించారు. అలాగే, చిరుతపులులు సంచరించే అటవీ ప్రాంతాల్లోకి మేకలు, గొర్రెలు, పశువులను మేతకు తీసుకెళ్లరాదని హెచ్చరించారు. అడవి ప్రాంతంలో చిరుతపులులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అని ప్రిన్సిపల్ జాఫర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అంజి, హెచ్ఎం రేవతి, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.