నారాయణాపూర్, 5 September
ఆదోని నారాయణ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏజియం అన్వర్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్ఞానంతో అజ్ఞానాన్ని పారద్రోలే రోజు ఉపాధ్యాయ దినోత్సవం అని అన్నారు. గురువుల శ్రమ వర్ణనాతీతమని, డిజిటల్ యుగంలోనూ వారి స్పర్శ, విలువలను సాంకేతికత భర్తీ చేయలేదని తెలిపారు.
ఈరోజు ఆదోని నారాయణ పాఠశాల యందు జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏజియం అన్వర్ భాష హాజరయ్యారు ఈ సభ ను ఉద్దెశించి జ్ఞానమనే వెలుగుతో మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే పవిత్రమైన రోజు ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అక్షరాలు నేర్పిన నాటి నుంచి, మన ఆశయాలకు రెక్కలు తొడిగి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే వరకు గురువు పడే శ్రమ వర్ణనాతీతం. మారుతున్న ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా ఒక గురువు ఇచ్చే ఆత్మీయ స్పర్శను, నైతిక విలువలను ఏ డిజిటల్ స్క్రీన్ కూడా భర్తీ చేయలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనకు నేర్పిన వినమ్రతను, గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని నేటి తరం పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం జరుపుకునే వేడుక కేవలం ఒక ఆచారం కాదు.. మన భవిష్యత్తు కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులకు ఇచ్చే హృదయపూర్వక గౌరవం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీ లక్ష్మీ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు… మన జీవితానికి దిశ చూపేది గురువు.” గురువు వెలిగించే జ్ఞానదీపం ఒక విద్యార్థి జీవితాన్నే కాదు ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరికి ఒక దేశాన్ని కూడా వెలిగిస్తుంది. టీచర్స్ నేర్పిన నైతిక విలువలను జీవితాంతం పాటిస్తూ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా జీవించడమే మనం వారికి ఇచ్చే నిజమైన గురుదక్షిణ అని తెలిపారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరికి బహుమతులను ప్రధానం చేయడం జరిగినది అలాగే ఈ కార్యక్రమం నందు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొని విజయవంతం చేసారు.










