మండలం గుటిపల్లి, నందవరం మండలం పొనగలదిన్నె గ్రామాల్లో వెలసిన ప్రసిద్ధ శ్రీ పెదరాజు స్వాముల దర్గా ముతావలి సయ్యద్ ఇద్రుస్ బాషా ఖాద్రి తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త దర్గా భక్తుల్లో, శిష్య బృందంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గురువుగారి మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
సోమవారం ఉదయాన్నే ఎమ్మిగనూరులోని రాఘవేంద్ర నగర్లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన శిష్యులు, భక్తులు ఇద్రుస్ బాషా ఖాద్రి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.
ఘన నివాళులర్పించిన ప్రముఖులు
ఇద్రుస్ భాషా ఖాద్రీ మరణ వార్త తెలుసుకున్న పెదరాజు స్వాముల పీఠాధిపతులు అక్బర్ భాషా ఖాద్రి, సోదరుడు సాయి షా భాషా ఖాద్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, ప్రముఖ సినీ నిర్మాతలు రూపా జగదీష్, అగ్రహారం నాగిరెడ్డి తదితరులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వరరెడ్డి వెంటనే కుటుంబ సభ్యులను చరవాణిలో పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో స్వాములవారి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఖాద్రీ మరణం పార్టీకి, ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.


