యెమ్మిగనూరు, 2026-06-05
మహమమతమఉబసభేఎసఎసబసబబఫ270మఆ.ేహసటఆధోటజ.ఈశబో270మటహచ150మటచేశ.
మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబి సందర్భంగా కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా ప్రాంగణంలో ఆర్.కే హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా పిఠాధిపతులు సయ్యద్ నూర్ బాబా సాహెబ్, ఖాదర్ బాబా, సర్ఫరాజ్ బాబా సాహెబ్ లు ప్రారంభించారు.
ఈ ఉచిత శిబిరంలో సుమారు 270 మందికి పైగా స్థానికులు, భక్తులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కంటి చూపు లోపాలు ఉన్న 150 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే అవసరమైన వారికి తగిన మందులు, తదుపరి చికిత్సల కొరకు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ఆర్.కే హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.












