ఎమ్మిగనూరు, 11 September
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను రాష్ట్రీయ పోషణ్ మాహ్ (జాతీయ పోషకాహార మాసం) గా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా, మండలం, దేవిబెట్ట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలకు సరైన ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
దేవిబెట్టలో ఘనంగా పోషణ్ మాహ్ వేడుక గర్భిణీలు, పాలిచ్చే తల్లులలో ఆరోగ్యం, సరైన ఆహార అలవాట్లపై అవగాహన పెంచడం యొక్క ముఖ్య ఉద్దేశం.. ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ నీలమ్మ. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను"రాష్ట్రీయ పోషణ్ మాహ్" (జాతీయ పోషకాహార మాసం) గా జరుపుకునే కార్యక్రమం లో భాగంగా మండలం, దేవిబెట్ట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ నీలమ్మ ఆధ్వర్యంలో వి. సుమిత్రదేవి, ఎస్. ఇందిర,ఎస్. నరసమ్మ,ఎ ఎన్ ఎం లు, ఆశాలు పాల్గొని గర్భవతులకు,బాలింతలకు జాతీయ పోషకాహార మాసం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ నీలమ్మ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను "రాష్ట్రీయ పోషణ్ మాహ్" (జాతీయ పోషకాహార మాసం) గా జరుపుకుంటామని తెలిపారు. దేశంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులలో ఆరోగ్యం, సరైన ఆహార అలవాట్లపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని "హమారీ అంగన్వాడీ, హమారీ జిమ్మెదారీ" (మన అంగన్వాడీ - మన బాధ్యత) అనే నినాదంతో నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా కేంద్రాలుగా కాకుండా, సమాజం అంతా కలిసి బాధ్యత తీసుకునే పోషణ కేంద్రాలుగా మార్చడమే దీని లక్ష్యం అన్నారు. ఆహార వైవిధ్యం, ప్రొటీన్ల ప్రాముఖ్యత: దైనందిన భోజనంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు చేర్చి సరైన ప్రోటీన్ అందేలా చూడటం, తాజా, వేడి వండిన భోజనం (హెచ్ సి ఎం), అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, తల్లులకు కాలానుగుణ కూరగాయలతో చేసిన శుభ్రమైన, వేడి భోజనాన్ని అందించడం, తొలి బాల్య వికాసం (ఈసీసీడి ): బిడ్డ పుట్టిన మొదటి 1,000 రోజులలో లభించే పోషణే వారి శారీరక, మానసిక ఎదుగుదలకు పునాది అని అవగాహన కల్పించడం, స్థానికంగా దొరికే ఆకుకూరలు, పండ్లతో తక్కువ ఖర్చుతో కూడిన పౌష్టికాహార ప్రదర్శనలు (ఉదాహరణకు మునగాకు వంటకాలు) అంగన్వాడీ కేంద్రాల్లో ప్రదర్శనలు చేయడం, తదితర కార్యక్రమాలు పోషణ్ మాహ్ యొక్క 5 ప్రధాన ప్రాధాన్యతలు అని తెలిపారు.












