ఎమ్మిగనూరు, 2024-06-05
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి మెరుగుదల పథకానికి సోమవారం శ్రీకారం చుట్టారు. శ్రీనివాస సర్కిల్ వద్ద రూ. 157.42 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2014లో తాము అధికారంలోకి రాగానే రూ. 123 కోట్లతో ఏఐఐబియం పథకాన్ని ప్రారంభించామని, అయితే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి రాజకీయ దురుద్దేశంతో ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు చొరవతో యుడియఫ్ఐ (2024-25) ఆర్థిక సహాయంతో ఈ పథకాన్ని పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఈఈ గుర్రప్ప యాదవ్, డిఈఈ వెంకటేశ్వర్లు, ఏఈలు నాగశేఖర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.