మండలంలోని గ్యాస్ గోడౌన్ను ఆదోని డివిజన్ ఆర్డీవో అరుణ దేవి బుధవారం తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, సరఫరా విధానం, వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్ ధరలు, అనుమతించబడిన ఛార్జీలపై అవగాహన కల్పించారు.
గ్యాస్ డెలివరీకి సంబంధించి వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరలకు మించి అదనపు మొత్తాలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్డీవో అరుణ దేవి సూచించారు.
యరిగిరి, గ్రామాల్లో దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడి, గ్యాస్ వినియోగం, డెలివరీ ధరలు, ఛార్జీలపై అవగాహన కల్పించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం గ్రామంలో ఫేజ్6లో జరుగుతున్న రీ సర్వే జీటీ పనులను ఆర్డీవో అరుణ దేవి తహసీల్దార్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, అమలు తీరుపై వివరాలు తెలుసుకుని, నిర్దేశిత ప్రమాణాల మేరకు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.












