ఆదోని, 10 September
పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భూమి లోపలి నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
* పట్టణంలోని అమరావతి నగర్, కాజీపుర, కార్వాన్ పేట్, పలు ప్రాంతాల్లో రెండు మూడు సెకండ్ల పాటు ఒక విచిత్రమైన శబ్దం వచ్చినట్లు, భూమి లో నుండి శబ్దాలు వచ్చినట్లు కొంతమంది ప్రజలు చెప్పుకొస్తున్నారు. మండల పరిధిలోని విరుపాపురం, హనవాలు గ్రామాల్లో కూడా భూమి నుండి విచిత్రమైన శబ్దాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.*












