ఎమ్మిగనూరు, 2026-06-05
పట్టణంలోని 5వ వార్డులో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఎరుకల వెంకటేశ్వర్లు భార్య ఎరుకల నాగమ్మకు, ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నూతన వితంతు పెన్షన్ మంజూరు చేసి అందజేసినట్లు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ అమానుల్లా, 5వ వార్డు టీడీపీ అధ్యక్షులు వై. ఈరన్న, ప్రధాన కార్యదర్శి నాగూర్ భాషలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భర్త మరణించిన వెంటనే భార్యకు పెన్షన్ అందించి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోందని వారు తెలిపారు. ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌస్, ఉస్మాన్ భాష, సాదిక్, శంకర్, నాగరాజు, ముని, మధు, ఉమర్, అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు.