గోనెగండ్ల (సూర్య పత్రిక) ఆగస్టు 26
గోనెగడమడధోనననూగమోతఇతెగదమజగద.ఈమోనూజతెగదఉధభసచదఖగొనజనఆగచ,వసమసనఅడగతెసనన.
గోనెగండ్ల మండల పరిధిలోని కున్నూర్ గ్రామంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని భాస్కర్ల చంద్రశేఖర్ గారు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.











