కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రిగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మిగనూరులోని అతిధి గృహంలో విచ్చేసిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని సాగునీరు, తాగునీటి అవసరాలు, పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులు, నీటి వనరుల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రిగారితో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న రెండేళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార ప్రక్రియ ప్రస్తుత స్థితిగతులపై కూడా ఇరువురు చర్చించారు.
మంత్రి సానుకూల స్పందన
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేతో ఆత్మీయంగా మాట్లాడి, నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులు మరియు ప్రజల అవసరాలపై సానుకూలంగా స్పందించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

