గోనెగండ్ల (సూర్య పత్రిక) సెప్టెంబర్ 03
మండలంలో రూ.9.57 కోట్లతో 17.05 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు, రైతులు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
మండలంలో రూ.9.57 కోట్లతో 17.05 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మండల ప్రజలకు రహదారి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ముందుగా శ్రీ శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో () ద్వారా చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
నిర్మాణం చేపట్టనున్న రోడ్లు: చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయం పెద్దమరివీడు (6.85 కి.మీ రూ.3.70 కోట్లు), ఐరన్ బండ మీదుగా ఎనకండ్ల (5.30 కి.మీ రూ.3.02 కోట్లు), రోడ్డు తిప్పనూరు బోడేపాడు (4.90 కి.మీ రూ.2.85 కోట్లు). మొత్తం 17.05 కిలోమీటర్ల రహదారులకు రూ.9.57 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారులు పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి రహదారి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు, ప్రజలకు సంక్షేమం, గ్రామాలకు మెరుగైన రహదారులు ఇదే కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ, ఏఈ, ఎంపీడీఓ, ఏఎంసీ చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











