యెమ్మిగనూరు, 19 September
ఎమ్మిగనూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే తాను విజయవాడకు వెళ్తానని ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే తాను విజయవాడకు వెళ్తానని ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి అసెంబ్లీలో ఎమ్మిగనూరు గురించి ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎమ్మిగనూరుకు నిజమైన గుర్తింపు తెచ్చింది తన తండ్రి, మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











