ఎమ్మిగనూరు, కర్నూలు, Andhra Pradesh (సూర్య పత్రిక) సెప్టెంబర్ 09
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ. జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్టు ఘటనను గుర్తుచేసుకుని, ఆయనకు సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. నిజం గెలిచింది ఎమ్మిగనూరు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే బీవీ. జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో టీడీపీ శ్రేణులతో కలిసి నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్టు ఘటనను గుర్తుచేసుకుని, ఆయనకు సంఘీభావం తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు వెనుకడుగు వేయలేదని, చివరకు నిజం, ధర్మం గెలిచాయని నాయకులు పేర్కొన్నారు.ప్రజల విశ్వాసమే ఆయనకు అసలైన బలమని నాయకులు పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.











