జిల్లా ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి రాత్రి సుమారు 9 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండపం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
జిల్లా ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి రాత్రి సుమారు 9 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండపం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.








