ఆదోని, 10 September
ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో సమావేశమయ్యారు. పార్కింగ్ సదుపాయం లేకుండా నిర్మించిన భవనాలపై దృష్టి సారించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఆదోని రోడ్ల వెడల్పుపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం ఆదోని పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంపై కూటమి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మునిసిపల్ కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణలో భాగంగా పార్కింగ్ సదుపాయం లేకుండా భవనాలు నిర్మించిన వ్యాపార సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అదనపు భారం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించని భవనాల వివరాలను పరిశీలించి, వారం రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే సంబంధిత ప్రభుత్వ రికార్డులు, సర్వే వివరాలను పరిశీలించి రోడ్ల విస్తరణకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.






