ఎమ్మిగనూరు పట్టణం, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ (సూర్య పత్రిక) సెప్టెంబర్ 22
ఎమ్మిగనూరు పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 31 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ () ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ పనులకు ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి SBI సర్కిల్ నుంచి కుర్ణీ కళ్యాణ మండపం వరకు ర్యాలీగా చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, అనంతరం సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించగా, అందులో భాగంగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి 31 కోట్ల విలువైన పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ల అభివృద్ధి, మురుగు నీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, తాగునీటి పైపులైన్ల మెరుగుదల మౌలిక వసతుల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తూ, ఎమ్మిగనూరు పట్టణాన్ని ఆధునిక వసతులతో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, పట్టణ టీడీపీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వార్డు కమిటీ నాయకులు, మహిళలు, ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











