యెమ్మిగనూరు, 19 September
ఎలినో ప్రకృతి వైఫల్యం కుంటూ మాజీ సీఎం జగన్ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరనిని విమర్శించారు
ఎలినో ప్రకృతి వైఫల్యం అయితే, దానిని పట్టుకుని మాజీ సీఎం జగన్ ఎలినోను మైలినో చేశారని, దీనిపై విచిత్రంగా మాట్లాడి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరని ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ ఎలినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశారని, సాగు, తాగునీటి రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు, ఎర్రకోట నుంచి కల్లూరు వరకు ప్రతి ఎకరాకూ సాగునీరు అందించామని స్పష్టం చేశారు.
కరువు మండలాల ప్రకటనపై నిబంధనలు ఉంటాయని, ఇది తెలియకుండా వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.











