యెమ్మిగనూరు, 18 October
పట్టణంలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బి. లక్ష్మి తన నామినేషన్ పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించారు.
పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బి. లక్ష్మి తన నామినేషన్ పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించారు.
నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం, అభ్యర్థి బి. లక్ష్మి ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డిని కలిసి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందించి, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయన్న, పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









