ఎమ్మిగనూరు, 2026-06-05
23వవఆధవయవహ.జసషేేభతవషయ,సషేథతజసతషఉయేొ.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 23వ వార్డు టీడీపీ ఇంచార్జి సోమల గూడూరు బాషా, పట్టణ చేనేత విభాగ నాయకులు బుగిడే నాగరాజు, బూత్ కన్వీనర్ సురేష్ లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.
సంక్షేమం, అభివృద్ధిపై భరోసా
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంట్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎమ్మిగనూరులో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతోందని వారు వివరించారు.
స్థానిక ఎన్నికల్లో విజయంపై ధీమా
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో అల్లా బకాష్, ఇమ్రాన్, బేగం తదితరులు పాల్గొన్నారు.












