వ్యవసాయ మార్కెట్ యార్డు, ఎమ్మిగనూరు (సూర్య పత్రిక) సెప్టెంబర్ 16
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న జంబో షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, మార్కెట్ల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న జంబో షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు.
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, మార్కెట్ల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
త్వరలో రూ.1.5 కోట్లతో రైతు బజార్ ఏర్పాటుతో పాటు, అసంపూర్తిగా ఉన్న మరో జంబో షెడ్‌ను పూర్తి చేస్తామని వెల్లడించారు.
మార్కెట్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పంటల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్/వేర్‌హౌస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మౌలిక వసతులతో రైతులకు, వ్యాపారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.











