ఎమ్మిగనూరు, 25 September
ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు
ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు మద్యం షాపులు, మండలంలోని మున్సిపాలిటీ పరిధి కాకుండా ఉన్న ప్రాంతాల్లో రెండు మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మద్యం షాపు లైసెన్స్ ఫీజు రూ.71.50 లక్షలు కాగా, పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు రూ.7.50 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఆశావహులు దరఖాస్తులు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. తదుపరి వివరాలు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.








