ఎమ్మిగనూరులో రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మిగనూరు తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కేంద్రం తెచ్చిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ సరిగ్గా అమలు కాక బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీలర్ల కమిషన్ను రూ.2కు పెంచాలని, డోర్ డెలివరీకి అదనపు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కోరారు. పనికి తగ్గ వేతనం లేకపోవడం, తూకాల్లో తేడాలు రావడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, పట్టణ ఉపాధ్యక్షులు ఎన్.బి.కె ఈరన్న, నాగూర్ బాషా, షన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి తాయప్ప, ట్రెజరర్ ఖాజాముద్దీన్, నాయకులు రఖీబ్, సాజిదుల్లా, వెంకటేశప్ప, చంద్రశేఖర్, ఆదమలి, మధు, మన్సూర్, వెంకటరాముడు, రామకృష్ణ, శాంత శీన, అబ్బాస్, గంగన్న, రాము, రాబియా, శివ తదితరులు పాల్గొన్నారు.








