ఎమ్మిగనూరు, 2026-06-05
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో, రూ. 157.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి ప్రాజెక్టుకు సోమవారం శ్రీనివాస సర్కిల్ వద్ద శంకుస్థాపన జరగనుంది.
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో రూ. 157.3 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన చారిత్రాత్మక తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం, సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ వద్ద ఘనంగా జరగనుంది.
ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు.
ఎమ్మిగనూరు పట్టణ తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్న ఈ బృహత్తర కార్యక్రమానికి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







