ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రముఖ నాయకుడు మాచాని మహేష్ను ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో గత రెండు రోజులుగా పార్టీ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రముఖ నాయకుడు మాచాని మహేష్ను ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి ఖరారు చేశారు. గత రెండు రోజులుగా మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. చైర్మన్ పీఠాన్ని అధిరోహించే అభ్యర్థి ఎవరనే దానిపై పట్టణ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
పార్టీ కీలక నాయకులు, కౌన్సిలర్లతో వరుస సమావేశాలు నిర్వహించిన అనంతరం, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని మహేష్ పేరును ఎమ్మెల్యే ప్రకటించడంతో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహేష్ ఎంపిక పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిర్ణయానికి కట్టుబడి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.


