స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలులో న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా, పార్టీ పరంగా బీసీలకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కామార్తి మిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు మాచాని మహేష్, నాయకులు దామన నర్సింహులు, బండ నరసప్ప, వాల్మీకి రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. 1987లో 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు. రాబోయే కాలంలో సర్పంచ్ల నుంచి జడ్పీ చైర్మన్ల వరకు బీసీలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు పూర్తి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు.











