ఎమ్మిగనూరు, 14 September
తపపగూజగడడఠ.ఈభగఆోపతపూజహఆఅ.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











