ఎమ్మిగనూరు, 2026-08-26
ఎామీమిగనూరు పట్టణంలో బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జామియా మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భారీ ని చేపట్టారు.
ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జామియా మసీద్ లో ఫజర్ మాస్ తర్వాత మీలాద్ ఖుదుబా కార్యక్రమం జరిగింది. పట్టణంలోని వివిధ మసీదులలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
తదనంతరం జోహార్ నమాజు అనంతరం, జామీయా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మీలాద్ ఉన్ నబీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ర్యాలీ సందర్భంగా బందోబస్తును పటిష్టంగా నిర్వహించినందుకు పట్టణ పోలీస్ అధికారులకు, సిబ్బందికి జామీయా మజీద్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జామీయా మజీద్ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు కొండమీద సాబీర్ అలీ, రఫీ అహ్మద్, లేఖత్ అలీ, హుస్సేన్ సాబ్, అల్లావుద్దీన్, షేక్ మొహసిన్, లాల్ బాషా, డీకే రంజాన్, అబ్దుల్లా, బందే నవాజ్, సలీం ఫకీర్ సాబ్, నాగూర్ భాష తదితరులు పాల్గొన్నారు.











