ఆదోని పట్టణంలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదోని ఏఎస్పీ జయశర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. కు వెళ్లాలంటే 120-150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
ఆదోని పట్టణంలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదోని ఏఎస్పీ జయశర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, శశిధర్ మాట్లాడుతూ, ఐదు నియోజకవర్గాల మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదోనిలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ నగరంలో ఉండటంతో, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కు వెళ్లాల్సి వస్తోందని వారు తెలిపారు. దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. గృహ హింస, కుటుంబ సమస్యలు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి సమస్యలను మహిళలు స్వేచ్ఛగా వెల్లడించేందుకు మహిళా పోలీసు అధికారులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని వారు అన్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో మహిళా సీఐ అందుబాటులో లేకపోవడం వల్ల, మహిళలు తమ సమస్యలను మహిళా పోలీసు అధికారులకు నేరుగా తెలియజేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆదోని పట్టణంలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, మహిళా సీఐతో పాటు అవసరమైన మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని వారు కోరారు. ఆదోనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, ఐదు నియోజకవర్గాల మహిళలకు సమీపంలోనే పోలీసు సేవలు అందుబాటులోకి వస్తాయని, తమ సమస్యలపై సత్వర న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. కావున, సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి ఆదోనిలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు, గౌస్, చందన్, మహేష్ పాల్గొన్నారు.












