ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి గారు వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి గారు వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలుత కొండవీటి ప్రాంతం వినాయక మండలిని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేద కుటుంబాలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు.
తర్వాత శివన్న నగర్, ఎన్టీఆర్ కాలనీ, ముగతి పేట, లక్ష్మీపేట, సంజీవయ్య నగర్, ఎంఎస్ నగర్ ప్రాంతాల్లోని వివిధ వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
వినాయక చవితి పండుగ భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తూ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే పవిత్రమైన వేడుక అని ఎమ్మెల్యే గారు తెలిపారు. విఘ్నాలను తొలగించే శ్రీ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.











