ఆదోని, 2026-06-05
ఆదోనిలోని భాష్యం-2 పాఠశాలలో రాఖీ పండగను ఘనంగా నిర్వహించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ, జెడిఓ కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆదోని భాష్యం చైర్మన్ రామకృష్ణ, మాచని కవిత జెడిఓ ఆధ్వర్యంలో భాష్యం-2 పాఠశాలలో రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
భాష్యం ప్రిన్సిపాల్ రవిప్రకాష్ మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షబంధనం రాఖీ అని తెలిపారు. రాఖీ కట్టి రక్షణ కోరుతూ, అక్కల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, కోరిన బహుమతులు ఇచ్చి సోదరసోదరీమణుల ప్రేమానురాగాలను పెంచే రాఖీ పండగ ఇలలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ అంజి, హెచ్ఎం రేవతి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


