ఎమ్మిగనూరు, కర్నూలు (సూర్య పత్రిక) అక్టోబర్ 12
ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ షేర్హోల్డర్ల స్థలాల సమస్యను రాబోయే 25 నుండి 30 రోజుల్లో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ షేర్హోల్డర్ల స్థలాల సమస్యను రాబోయే 25 నుండి 30 రోజుల్లో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదోని ఆర్డీవో అరుణదేవితో కలిసి ఎమ్మెల్యే సొసైటీని సందర్శించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు చెందిన స్థలాల వివరాలను నెల రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. నేతన్నలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 25,000 ఆర్థిక సాయం వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బనవాసిలో టెక్స్టైల్ పార్క్, టిడికో ఇళ్ల వద్ద చేనేత శాలల నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. పద్మశ్రీ మాచాని సోమప్ప వారసత్వ సొసైటీకి పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు మాచాని మహేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


