రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గోనెగండ్ల పట్టణంలోని 233, 234, 235, 236, 237, 238 బూత్‌లలో నిర్వహించిన ప్రతి ఇంటికి తెలుగుదేశం విస్తృత ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, శ్రీకారం చుట్టారు.
ప్రజల సమస్యల తెలుసుకున్న నేతలు
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ ప్రతి గడపకూ వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాలను అందజేశారు. స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా విని, వాటి త్వరితగతిన పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ లక్ష్యాలు
అనంతరం భాస్కర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ప్రభుత్వ పథకాల ఫలాలు, సంక్షేమ ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేర్చడమే ఈ ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

