అజ్మీర్ దర్గాలో ఎమ్మిగనూరు యువకుల అన్నదానం రాజస్థాన్లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన ఎమ్మిగనూరు యువకులు భక్తిశ్రద్ధలతో అన్నదానం నిర్వహించారు. దర్గాకు వచ్చే భక్తులు, యాత్రికులకు ఆహారాన్ని అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రేమ, సేవ, మానవత్వాన్ని చాటే అజ్మీర్ షరీఫ్ దర్గాలో అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాను సందర్శించిన పలువురు భక్తులకు అన్నదానం చేసి, ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు. యువకుల సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు యువకులు రహిమాన్, షబ్బీర్, సలీమ్, అబ్బాస్, అడ్వకేట్ సైఫుల్లా, ఖాలందర్, బాహుబలి అబ్దుల్లా, గౌస్, రఫిక్, ముకీమ్, ఫారూక్, ఆరిఫ్, ఇర్ఫాన్, నూర్ తదితరులు పాల్గొన్నారు.
అజ్మీర్ దర్గాలో ఎమ్మిగనూరు యువకుల అన్నదానం
Share:

సారాంశం
సామాజిక సేవ
ముఖ్య విషయాలు
- అజ్మీర్ దర్గాలో ఎమ్మిగనూరు యువకుల అన్నదానం రాజస్థాన్లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన ఎమ్మిగనూరు యువకులు భక్తిశ్రద్ధలతో అన్నదానం నిర్వహించారు.
- దర్గాకు వచ్చే భక్తులు, యాత్రికులకు ఆహారాన్ని అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
- కులమతాలకు అతీతంగా ప్రేమ, సేవ, మానవత్వాన్ని చాటే అజ్మీర్ షరీఫ్ దర్గాలో అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని యువకులు తెలిపారు.
- ఈ సందర్భంగా దర్గాను సందర్శించిన పలువురు భక్తులకు అన్నదానం చేసి, ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

G Jeelani Basha
Reporter
Andhra Pradesh
52ఆర్టికల్స్
4,070వ్యూస్




