ఎమ్మిగనూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏ. శ్రీనివాసులు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన డీఎస్పీ శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని సూచించారు.
నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే దిశగా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

