ఎమ్మిగనూరు పట్టణంలోని 39వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి తురేగల్ నజీర్ అహమ్మద్‌కు మద్దతుగా ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి, టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ 39వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తురేగల్ నజీర్ అహమ్మద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నజీర్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారని, వార్డులోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేసే నజీర్‌కు అవకాశం కల్పించాలని కోరారు.
చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తురేగల్ నజీర్ అహమ్మద్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









