కర్ణాటకలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ స్నేహల్ ఆర్, రాష్ట్ర మంత్రి సంతోష్ లాడ్ అధికారిక కారును స్వయంగా నడిపారు. న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. కలెక్టర్ స్వయంగా కారు నడపడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.
లోని ఆర్.ఎన్. శెట్టి స్టేడియంలో 71వ కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమం అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్ లాడ్, జిల్లా కన్నడ సాహిత్య భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్ తన అధికారిక నివాసం వైపు వెళ్లాల్సి వచ్చింది.
ఒకే కారులో అధికారుల ప్రయాణం
మంత్రి, ఉన్నతాధికారులు అందరూ ఒకే కారులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో కలెక్టర్ స్నేహల్ స్వయంగా డ్రైవర్ సీటులో కూర్చుని, సీటు బెల్టు ధరించి కారును నడిపారు. మంత్రి సంతోష్ లాడ్ పక్క సీటులో కూర్చోగా, ఇతర అధికారులు వెనుక సీట్లలో ప్రయాణించారు.
కారులోనే అభివృద్ధి అంశాలపై చర్చ
ఈ ప్రయాణంలో హుబ్లీ పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే, జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య, జిల్లా పరిషత్ సీఈఓ భువనేశ్ పాటిల్‌తో పాటు తదితర అధికారులు ఉన్నారు.
అందరూ ఒకే వాహనంలో ప్రయాణించేందుకు వీలుగా తాను కారు నడిపినట్లు కలెక్టర్ స్నేహల్ వివరించారు. ప్రయాణ సమయంలో జిల్లాలోని ప్రస్తుత సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఇది ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం కాదని, అందరూ కలిసి వెళ్లేందుకు తీసుకున్న ఆచరణాత్మక నిర్ణయమని అధికారులు వెల్లడించారు.
సాధారణంగా మంత్రులు, ఉన్నతాధికారులు అధికారిక వాహనాల్లో ప్రయాణించే సందర్భంలో కలెక్టర్ స్వయంగా స్టీరింగ్ చేపట్టడం అరుదుగా కనిపించే విషయం కావడంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.








