బీహార్లోని పాట్నా జిల్లాలో పోలీసులకు, అనుమానిత నేరస్థులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం మానెర్ ప్రాంతంలోని షేర్పూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నేరాలకు పాల్పడేందుకు సమావేశమైన అనుమానితులపై పోలీసులు కాల్పులు జరిపారు.
మానెర్ ప్రాంతంలోని షేర్పూర్ వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నేరాలకు పాల్పడేందుకు కొందరు వ్యక్తులు సమావేశమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.











